- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశ బహిష్కరణ భయం.. పార్ట్‌టైం జాబ్స్ వదిలేస్తున్న విద్యార్థులు

- అమెరికాలోని ఇండియన్లలో ఆందోళన
దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ ఆందోళన చెందుతున్నారు. అక్రమ వలసలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత విద్యార్థులకు దడ పుట్టిస్తోంది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారినందరూ సామూహిక బహిష్కరణ కాక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. దీంతో భారత విద్యార్థులు బహిష్కరణ వేటు పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూఎస్ వెళ్లిన విద్యార్థుల్లో అత్యధికులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఖర్చులకు సంపాదించుకుంటారు. కాలేజీ ముగిసిన తర్వాత ఎక్స్‌ట్రా మనీ కోసం కాఫీ షాపులు, పెట్రోల్ బంక్స్, మాల్స్‌లో పని చేస్తుంటారు. ఇలా పని చేయడం అక్రమమే అయినా.. ఇండియాలో బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చడానికి, ఈఎంఐలు కట్టడానికి చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఇలాంటి జాబ్స్ చేస్తున్న విద్యార్థులు మానేస్తున్నారు. అమెరికాలో తమ భవిష్యత్‌ను ప్రమాదంలో పడేసుకోవడం ఎందుకనే ఆలోచనతో పార్ట్ టై జాబ్స్‌కు స్వస్తి పలుకుతున్నారు. ఎఫ్-1 వీసాపై యూఎస్ వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌లో వారానికి 20 గంటలు పని చేసేకునే వెసులుబాటు ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్థులు క్యాంపస్ బయట అక్రమంగా జాబ్స్ చేస్తున్నారు. ఇలా చట్టానికి వ్యతిరేకంగా జాబ్స్ చేసే వారిపై దేశ బహిష్కరణ వేటు పడే అవకాశం ఉండటంతో ముందస్తుగా మానేస్తున్నట్లు తెలిసింది. కొన్ని నెలలు పరిస్థితి గమనించిన తర్వాత పని చేసే అవకాశం ఉంటే అప్పుడు మళ్లీ పార్ట్ టైం జాబ్స్‌లో జాయిన్ అవుతామని విద్యార్థులు చెబుతున్నారు.