Farooq Abdullah: బీజేపీ ముస్లింలను విభజిస్తోంది.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

by vinod kumar |
Farooq Abdullah: బీజేపీ ముస్లింలను విభజిస్తోంది.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ముస్లింలను విభజిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. రాబోయే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ఆయన అనంతనాగ్‌లో మీడియాతో మాట్లాడారు. మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సైతం బీజేపీ గురించే మాట్లాడుతారన్నారు. ఆయన బీజేపీతోనే ఉన్నారని పక్కా ప్లాన్ ప్రకారమే బయటకు రప్పించారని విమర్శించారు. రషీద్ ద్వారా కశ్మీర్ ముస్లింలను చీల్చేందుకు కుట్ర పన్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఎంపీ షేక్ రషీద్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆయన బుధవారం రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story