- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూపీకి పంపితే.. మా ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాం

- సమాజ్ వాదీ పార్టీకి ఆదిత్యానాథ్ చురకలు
- ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీ వ్యాఖ్యలపై మండిపాటు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీని పార్టీ నుంచి బహిష్కరించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ డిమాండ్ చేశారు. ఇటీవల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ అబు అజ్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై యూపీ అసెంబ్లీలో ఆదిత్యానాథ్ స్పందిస్తూ.. అబు అజ్మీని పార్టీ నుంచి బహిష్కరించి యూపీకి పంపించండి.. అలాంటి వారిని ఎలా ట్రీట్ చేయాలో మాకు తెలుసు అని ఆదిత్యానాథ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఔరంగజేబును తమ ఆరాధ్యదైవంగా భావిస్తోంది. హిందువులపై జిజియా పన్ను వేసి, తన తండ్రి షాజహాన్‌ను ఆగ్రా కోటలో బంధించిన వ్యక్తి ఔరంగజేబు. అలాంటి వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి దైవ స్వరూపమని ఆదిత్యానాథ్ విమర్శించారు. అబు అజ్మీ వ్యాఖ్యలను ఖండించి, అతడిని ఎస్పీ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాగా ఔరంగజేబు పాలనను కీర్తిస్తూ మహారాష్ట్ర ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. అతను ఒక సమర్థవంతమైన పాలకుడని, మసీదులతో పాటు దేవాలయాలను కూడా కూల్చేశాడని అజ్మీ అన్నారు. ఔరంగజేబుకు, మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు శంభాజీకి మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరం మాత్రమే అని అన్నారు. కాగా, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అజ్మీ ఆ తర్వాత చెప్పారు. తాను శివాజీ, శంభాజీల గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఔరంగజేబు వ్యాఖ్యలపై అబు అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.