- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Devendra Fadnavis: బీజేపీకే సీఎం పదవి ఇచ్చేందుకు షిండే అంగీకరించారు

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మహాయుతి కూటమి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)గురించి మాట్లాడారు. తాను అడిగితేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలో సీఎం అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే ఉండేందుకు షిండే అంగీకరించారు. అయితే, షిండే కూటమి ప్రభుత్వంలో భాగం కాకూడదని, మహాయుతి కూటమి సజావుగా సాగేందుకు నేతృత్వం వహిస్తే చాలని శివసేనలోని ఓ వర్గం భావించింది. తమ పార్టీ నుంచి సీఎం కావాలని శివసేన నాయకులు కోరుకున్నారు. వ్యక్తిగతంగా షిండేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రమాణస్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే నేను షిండేతో భేటీ అయ్యాను. అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారు’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
పోర్ట్ ఫోలియోల కేటాయింపు వివాదంపై..
అయితే, పోర్ట్‌ఫోలియోలపై వివాదం ఇంకా నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. శివసేన హోం మంత్రిత్వ శాఖను పొందడంపై పట్టుబట్టినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఊహాగానాలపై షిండే స్పందించారు. శివసేన ఎలాంటి పోర్ట్‌ఫోలియోను డిమాండ్ చేయలేదన్నారు. డిసెంబర్ 16 లోపు కేబినెట్ విస్తరణ జరుగుతుందని ఫడ్నవీస్ చెప్పారు. దాదాపు అన్ని శాఖలపై ఏకాభిప్రాయానికి వచ్చామని.. హోం శాఖ ఎప్పుడూ బీజేపీతోనే ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ చేతిలోనే హోం శాఖ ఉందని.. మహారాష్ట్రలోనూ కాషాయపార్టీ చేతిలోనే ఆ శాఖ ఉంటే సమన్వయం మరింత సులభతరం అవుతందన్నారు. మహారాష్ట్రలో ప్రధాని మోడీ 'ఏక్ హై తో సేఫ్ హై' , లడ్కీ బహిన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను బీజేపీకి ఓట్లు పడేలా చేశాయన్నారు. ఈ నినాదాలతో బీజేపీకి 5 శాతం ఓట్లు పెరిగాయన్నారు. ఇకపోతే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఈక్రమంలోనే సీఎం ఎవరనే అంశంపై కూటమి నేతల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిందే, ఎన్సీపీ అగ్రనేత అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.