- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అవుతోంది.. మరోసారి విరుచుకుపడిన ప్రధాని మోడీ
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఎటాక్ చేశారు. మంగళవారం రాజస్థాన్ లోని టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి ఎదురు దాటి చేశారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అయిందని కర్నాటకలో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తిని కొట్టారు ఫైర్ అయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రామనవమి నిషేధించారని గుర్తు చేశారు. నిర్భయంగా హనుమాన్ చాలిసా పారాయణం చేసే గ్యారంటీని బీజేపీ ఇస్తోందన్నారు. 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. దళితులు, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కును హరించి ముస్లింలకు రిజర్వషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తందని, ఓటు బ్యాంకు కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తామంటోందని ఫైర్ అయ్యారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని భావించింది. ఇదే తరహాలో దేశం మొత్తంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేసింది. కానీ 2004, 2010లో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నించినా చట్టపరమైన అడ్డంకుల వల్ల అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.