President On Kolkata Horror: అదో భయానక ఘటన.. నేను నిరాశకు గురయ్యా

by Shamantha N |
President On Kolkata Horror: అదో భయానక ఘటన.. నేను నిరాశకు గురయ్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని.. ఆ వార్త విని నిరాశకు గురయ్యానని అన్నారు. ఇక జరిగింది చాలు.. మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యాలో తొలిసారిగా కోల్ కతా హత్యాచారణ ఘటనపై ఆమె స్పందించారు. కుమార్తెలు, సోదరీమణలు ఇలాంటి అఘాయిత్యాలకు బలవడాని ఏ సమాజం ఒప్పుకోదన్నారు. ఓవైపు విద్యార్థులు, డాక్ట‌ర్లు, సామాన్యులు.. కోల్‌క‌తా ఘ‌ట‌నపై నిర‌స‌న చేప‌డుతుంటే, మ‌రో వైపు నేర‌స్థుల మాత్రం స్వేచ్ఛ‌గా తిరుగుతున్నారని మండిపడ్డారు.

ముర్ము ఏమన్నారంటే?

స‌మాజం త‌న‌ను తాను ఆత్మప‌రిశీల‌న చేసుకోవాల‌ని, కొన్ని క‌ఠినమైన ప్ర‌శ్నలు వేసుకోవాల‌న్నారు. సమాజానికి “నిజాయితీ, నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన” అవసరమని గుర్తుచేశారు. నీచమైన మనస్తత్వం ఉన్నవారే స్త్రీని తక్కువ చేసి చూస్తారని, ఆమెకు శక్తిమంతమైనది కాదని, సామర్థ్యం ఉండదని, తక్కువగా తెలవితేటలు ఉన్నట్లు భావిస్తారని అన్నారు. నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల కాలంలో.. స‌మాజం ఎన్నో అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోయింద‌ని.. ఇలా వాటిని మర్చిపోవడం అసహ్యకరమని అన్నారు. గ‌తంలోజరిగిన త‌ప్పుల‌ను ఎదుర్కొనేందుకు స‌మాజం భ‌య‌ప‌డుతోంద‌న్నారు. కానీ, ఇప్పుడు చ‌రిత్ర‌ను స‌మూలంగా మార్చేందుకు సమ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. స‌మ‌గ్రంగా ఈ స‌మ‌స్య‌ను నిర్మూలించేందుకు అందరం కలిసి ప్ర‌య‌త్నిద్దామ‌ని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed