Emergency Movie: కంగన ‘ఎమర్జెన్సీ’ మూవీకి యూఏ సర్టిఫికెట్

by Hajipasha |
Emergency Movie: కంగన ‘ఎమర్జెన్సీ’ మూవీకి యూఏ సర్టిఫికెట్
X

దిశ, నేషనల్ బ్యూరో : బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో కంగన నటించారు. యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేస్తూనే సీబీఎఫ్‌సీ కొన్ని షరతులు విధించింది. సినిమాలోని కొన్ని అభ్యంతరకర సీన్లను తొలగించాలని సూచించింది.

ఇంకొన్ని సీన్లను ప్రదర్శించే చోట డిస్‌క్లెయిమర్లను ప్రదర్శించాలని నిర్దేశించింది. యూఏ సర్టిఫికెట్‌ను పొందే సినిమాలను అన్ని వయో వర్గాల వారు చూడొచ్చు. అయితే పిల్లలు మాత్రం ఈ సినిమాను తల్లిదండ్రులు/పెద్దల సమక్షంలో చూడొచ్చు.ఈ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెండూ కంగనా రనౌతే. ఇందులో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే కూడా నటించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed