ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని అరికట్టేందుకు.. ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన Election Commission of India

by Vinod kumar |   ( Updated:2023-07-03 14:05:28.0  )
ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని అరికట్టేందుకు.. ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన Election Commission of India
X

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. రాజకీయ పార్టీలు తమకు లభించిన విరాళాలు, చేసిన ఖర్చులు తదితర వివరాలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. దేశంలో రాజకీయ పార్టీలకు లభించే అక్రమ విరాళాలు, నిధులను అరికట్టడం, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసేందుకే ఈ పోర్టల్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నది. ఒకవేళ తమ ఆర్థిక వివరాలను ఆన్‌లైన్‌లో చూపించేందుకు ఇష్టపడని రాజకీయ పార్టీలకు ఈసీ మరో ఆప్షన్ కూడా ఇచ్చింది.

దానికి కారణాలను రాతపూర్వకంగా తెలపాలని.. ఆ కారణం సరైనదేనని ఈసీ నిర్ధారిస్తే.. నిర్ధేశించిన ఫార్మాట్‌లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్‌లలో నివేదికను అందజేయొచ్చని తెలిపింది. ఆర్థిక నివేదికలను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు ఇష్టపడని పార్టీల లేఖతో పాటు అన్ని నివేదికలను ఈసీ తన పోర్టల్‌లో పొందుపరుస్తుందని పేర్కొన్నది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed