స్కూళ్లలో ‘ వాటర్ బెల్’ మూడు సార్లు నీళ్లు తాగాల్సిందే.. విద్యాశాఖ ఆదేశాలు

by Ramesh N |
స్కూళ్లలో ‘ వాటర్ బెల్’ మూడు సార్లు నీళ్లు తాగాల్సిందే.. విద్యాశాఖ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇకపై వాటర్ బెల్ కూడా మోగనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు హైడ్రేషన్ బ్రేక్ ఇవ్వాలని తాజాగా ఒడిశా విద్యాశాఖ నిర్ణయించింది. కమీషనర్ కమ్ సెక్రటరీ, అశ్వతి ఎస్ బుధవారం డిపార్ట్‌మెంట్ జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడు సార్లు ‘వాటర్ బెల్స్’ మోగించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులను నీరు తాగాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 8.30, 10:00, 11:00 గంటలకు ‘వాటర్ బెల్’ మోగిస్తారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఒడిశాలో ఏప్రిల్ 2 నుంచి ఒక్క పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7 నుంచి 11:30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇటీవల వాటర్ బెల్ స్పెషల్ రూల్‌ను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి.

Advertisement

Next Story