- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరద్ పవార్ మనవడికి ఈడీ సమన్లు
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మనవడు, పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్’(ఎంఎస్సీబీ) కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఈ నెల 24న తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం ఇదే కేసులో ‘బారామతి అగ్రో లిమిటెడ్’ అనే కంపెనీలో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు రోహిత్ పవార్ సీఈవో కాగా, ఆయన తండ్రి రాజేంద్ర పవార్ మేనేజింగ్ డైరెక్టర్. నష్టాల్లో ఉన్న ‘కన్నడ్ ఎస్‌ఎస్‌కే షుగర్ మిల్లు’ను బారామతి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు రిగ్గింగ్ వేలం ద్వారా రూ.50 కోట్లకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఔరంగబాద్‌లోని కన్నడ్ ఎస్ఎస్‌కే మిల్లు ఎంఎస్సీబీ బ్యాంకులో రుణం తీసుకుని(డీఫాల్టెడ్) చెల్లించలేదు. దీంతో 2012లో ఆ మిల్లును బ్యాంకు స్వాధీనం చేసుకుని, బారామతి ఆగ్రో లిమిటెడ్ సంస్థకు వేలం ద్వారా విక్రయించింది. అయితే, ఈ వేలంలో బారామతి సంస్థనేకాకుండా పవార్ కుటుంబానికే చెందిన మరో రెండు కంపెనీలైన ‘హైటెక్ ఇంజినీరింగ్ కార్పొరేషన్ ఇండియా’, ‘సమృద్ధి షుగర్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలు సైతం పాల్గొన్నాయి. ఈ బిడ్‌లో పాల్గొనేందుకు హైటెక్ ఇంజినీరింగ్ చెల్లించిన రూ.5కోట్లను బారామతి ఆగ్రో లిమిటెడ్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు అనుమానిత లావాదేవీల ద్వారా మిల్లు కొనుగోలు చేసినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో రోహిత్ పవార్‌తోపాటు 70 పొలిటీషియన్లకు సంబంధముందని చెబుతోంది.