Kriti Verma :బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఈడీ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 13:23:21.0  )
Kriti Verma :బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఈడీ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రితి వర్మకు ఈడీ షాక్ ఇచ్చింది. రూ.263 కోట్ల టీడీఎస్ రిఫండ్ ఫ్రాడ్ కేసులో ఈడీ తాజాగా నటికి నోటీసులు జారీ చేసింది. అక్రమంగా ట్యాక్స్ రిఫండ్ పొందుతున్న ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తితో ఈ నటికి సంబంధం ఉన్నట్ల గుర్తించిన ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాగా క్రితి వర్మ రౌడీస్, బిగ్ బాస్ సీజన్ 12తో ఫేమస్ అయ్యారు.

గురుగ్రామ్‌లోని ఓ ప్రాపర్టీని క్రితి వర్మ అమ్మగా రూ.1.02 కోట్లు వచ్చాయని కాగా ఫ్రాడ్ కేసు డబ్బుతో ఆ ప్రాపర్టీని వర్మ కొన్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు రూ.69 కోట్ల విలువ గల భూములు, ఫ్లాట్స్, లగ్జరీ కార్లను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన అస్సెట్స్ క్రిత వర్మ‌తో పాటు ఈ కేసుతో సంబంధాలు ఉన్న భూషణ్ అనంత్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టిల పేరిట కొనుగోలు చేసినట్లు ఈడీ తెలిపింది. Former Bigg Boss Contestant Kriti Verma Questioned by ED in Rs 263 Crore Money Laundering Case

Advertisement

Next Story

Most Viewed