కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ

by S Gopi |   ( Updated:2024-05-21 13:36:13.0  )
కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ కేసులో జైలుకు వెళ్లి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కొర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. వచ్చే నెల 2న కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగిసేలోపు జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ తన పిటిషన్‌లో అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 21న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పలు దశల్లో ఈడీ విచారించిన తర్వాత ఆయనను తీహార్ జైలుకు పంపించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ఉన్న కారణంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. పిట్షన్‌పై విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాల వరకు బెయిల్ కోరగా, కోర్టు దానికి ఒక రోజు ముందే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story