- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ షెడ్యూలు రిలీజ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బిహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. బిహార్ లోని రుపాలి, పశ్చిమబెంగాల్ లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్ (ఎస్సీ), బాగ్దా (ఎస్సీ), మాణిక్తలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్ లోని అమర్వారా(ఎస్టీ), ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్, మంగ్లౌర్, పంజాబ్ లోని జలంధర్ పశ్చిమ(ఎస్సీ), హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్‌పూర్, నలాగర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికల జరగనున్నది.
నోటిఫికేషన్ షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల: 14.06.2024
నామినేషన్లకు ఆఖరి గడువు:21.06.2024
నామినేషన్ల పరిశీలన: 24.06.2024
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు:26.06.2024
పోలింగ్: 10.07.2024
ఓట్ల లెక్కింపు:13.07.2024