- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఐపీఎస్ అధికారికి 20 ఏళ్ల జైలు.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలోనూ దోషిగా తేల్చింది.1996లో గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలో డ్రగ్స్ జప్తు కేసులో రాజస్థాన్ న్యాయవాదిని ఇరికించిన వ్యవహారంలో సంజీవ్ భట్‌ను బనాస్‌కాంఠా జిల్లా అదనపు సెషన్స్ కోర్టు బుధవారమే దోషిగా నిర్ధారించింది. అయితే దీనిపై గురువారం తీర్పును వెలువరించిన కోర్టు.. సంజీవ్ భట్‌కు 20 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఓ వివాదాస్పద ఆస్తిని బదిలీ చేయించడం కోసం ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా సుమేర్‌సింగ్ రాజ్‌పురోహిత్ అనే న్యాయవాదిపై డ్రగ్స్ కేసును సంజీవ్ భట్ బనాయించారన్నది ఆరోపణ. ఈ కేసుల నేపథ్యంలో సంజీవ్ భట్‌ను 2015లోనే పోలీసు విభాగం నుంచి తొలగించారు. ఆ సమయానికి బనస్కాంత జిల్లా ఎస్పీగా ఆయన వ్యవహరించేవారు. 2018 సెప్టెంబరులో సంజీవ్ భట్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 2019లో సంజీవ్ భట్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. తాాజాగా ఇప్పుడు బనాస్‌కాంఠా జిల్లాలోని కోర్టు కూడా జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.