- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచానికే విద్యా కేంద్రంగా ఢిల్లీ.. సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికే విద్యా కేంద్రంగా ఢిల్లీ ని మార్చాలని కలగన్నట్లు చెప్పారు. శుక్రవారం దేశ రాజధానిలో ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ అవార్డు గ్రహీతను కలిసినట్లు చెప్పారు. ఈ అవార్డులను గొప్ప పురస్కారంగా వారు భావిస్తున్నారని చెప్పారు. వీటితో విద్యార్థుల్లోనూ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.
గత ఏడేమినిదేళ్లలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల మధ్య అంతరం తగ్గింది. ఈ అవార్డులు రెండింటిని కలిపింది. ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య ఎలాంటి వివక్ష లేదు’ అని అన్నారు. ఢిల్లీలో 1800 మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు ఉన్నాయని, వాటి పరిస్థితులు సరిగ్గా లేవని.. త్వరలో పునరుద్దరిస్తామని చెప్పారు. ప్రపంచానికి విద్యా కేంద్రంగా ఢిల్లీ ని మార్చాలని అనుకున్నామన్నారు. దీనిలో భాగంగానే టీచర్లు, ప్రిన్సిపాళ్లు కృషితో విద్యా నాణ్యతను మెరుగుపరుస్తామని చెప్పారు.