ZORAWAR: తేలికపాటి యుద్ధ ట్యాంక్.. 'జొరావర్' పరీక్ష విజయవంతం!

by Geesa Chandu |
ZORAWAR: తేలికపాటి యుద్ధ ట్యాంక్.. జొరావర్ పరీక్ష విజయవంతం!
X

దిశ, వెబ్ డెస్క్: చైనా(China)ను సమర్ధంగా ఎదుర్కోవడానికి.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ జొరావర్(Zorawar) విజయవంతంగా ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జొరావర్ ట్యాంకు అద్భుత ప్రదర్శన చేసిందని, ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్(Field Firing) లక్ష్యాలన్నీ నెరవేరినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence) ఒక ప్రకటనలో తెలిపింది.

'జొరావర్'(Zorawar) బరువు దాదాపు 25 టన్నులు ఉంటుంది. అందువలన దీన్ని వాయు మార్గంలోనూ తరలించవచ్చని రక్షణ శాఖ తెలిపింది. ఎల్&టీ (L&T) సహకారంతో.. డీఆర్డీవో (DRDO) ఈ ట్యాంకును అభివృద్ధి చేసింది. అయితే దీనిని ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మోహరించడానికి రూపొందించారు. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో దీనిని మోహరించనున్నారు. సుమారు 350 కి పైగా జొరావర్ లను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను రంగంలోకి దించింది.

Advertisement

Next Story

Most Viewed