- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ యాంకర్ల షోకు వెళ్లకూడదు.. ‘ఇండియా’ కూటమి సంచలన నిర్ణయం!
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలని కంకణం కట్టుకున్న ‘ఇండియా’ కూటమి తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నది. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసే మీడియా సంస్థలను బైకాట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపక్షాలపై వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానళ్లు, యాంకర్లు, టీవీ షోలకు ‘ఇండియా’ కూటమి నేతలు ఎవరూ వెళ్లవద్దని నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
ఇండియా కూటమి నేతలు హాజరు కాకూడని ఛానెళ్లు, యాంకర్ల పేర్ల వివరాలతో ఓ జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. అయితే కొన్ని టీవీ ఛానెళ్లు పని గట్టుకుని ‘ఇండియా’ కూటమిపై విష ప్రచారం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో వంటి యాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా తప్పుడు కథనాలతో ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాయని ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష కూటమికి పనిగట్టుకుని వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఛానెళ్లు, యాంకర్లను బహిష్కరించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆంక్షలు విధించిన ఛానెళ్లు, యాంకర్ల వివరాలతో కూడిన జాబితాను అధికారికంగా త్వరలోనే వెలువడుతుందని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇండియా కూటమి బహిష్కరించబోయే యాంకర్ల జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతున్నది. ఈ జాబితాలో ఉన్న వారి షో లకు ఈ నెల నుంచే ఇండియా కూటమి నేతలు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత 4 సంవత్సరాలలో జరిగిన అన్ని చర్చల పరిశీలన, ఆ ప్రోగ్రామ్ ల హిస్టరీ ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న యాంకర్ల జాబితా :
-అమన్ చోప్రా
-అమిష్ దేవగన్
-అర్నాబ్ గోస్వామి
-సుశాంత్ సిన్హా
-చిత్రా త్రిపాఠి
-దీపక్ చౌరాసియా
-రూబికా లియాఖత్
వీరితో పాటు మరికొంత మంది ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది.