- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Donald Trump: నువ్వో స్టుపిడ్ ప్రెసిడెంట్.. జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: రష్యా (Russia), ఉక్రెయిన్ (Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ (Zelensky) వైట్ హౌజ్ (White House)లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా రష్యాతో యుద్ధాన్ని ఆపి శాంతి ఒప్పందం చేసుకోవడం.. ప్రతిగా ఉక్రెయిన్ (Ukrain)లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్, జెలెస్కీని కోరారు. ఈ క్రమంలోనే తాను ఎట్టి పరిస్థితుల్లో రష్యాతో యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి అధ్యక్షుల మధ్య మీడియా ఎదుటే వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ట్రంప్ మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకోండని తేగేసి చెప్పారు. జెనెన్‌స్కీ (Zelensky)కి అమెరికా పట్ల కృతజ్ఞత లేదని ఫైర్ అయ్యారు.
యుద్ధం ఆపకపోతే చచ్చిపోతావని.. ఉక్రెయిన్ నాశనం అయిపోతుందని హెచ్చరించారు. ఈ పరిణామం అమెరికాతో పాటు ఉక్రెయిన్‌కు మంచిది కాదని ట్రంప్ అన్నారు. రష్యాతో యుద్ధంలో నువ్వు గెలవలేవని.. అమెరికా అండ లేకపోతే రెండు వారాల్లోనే ఉక్రెయిన్ ఓడిపోయేదని అన్నారు. తమ స్టుపిడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) ఉక్రెయిన్‌కు అనవసరంగా సాయం చేశాడని ట్రంప్ ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరు అధ్యక్షుల మీడియా సమావేశం అర్థాంతరంగా ముసింది. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ యుద్ధ కాంక్షతో ఉన్నారని అన్నారు. లక్షల మంది జీవితాలతో ఆటలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్ల సాయం అందజేశామని అన్నారు. జెలెన్‌స్కీ ఓ స్టుపిడ్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు.