- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పిన డీకే శివకుమార్.. ఎన్డీయే సీట్లు చూస్తే షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లక్నోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జూన్ 4న రాబోయే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని డీకే శివకుమార్ ధీమా వ్యక్తంచేశారు.
సమిష్టి నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. కూటమి నేతలు కలిసి పని చేస్తున్నారని, ఇండియాకు 300 సీట్లు, ఎన్డీయేకు 200 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపించడం వల్లే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ రెండంకెలకు చేరదని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీలు చేశారు కానీ.. వాటిలో ఏ ఒక్కటి కూడా బీజేపీ నిలబెట్టుకోలేదన్నారు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవడం పైనే వారి రాజకీయాలు ఆధారపడి ఉన్నాయన్నట్లుగా డీకే విమర్శించారు.