అమెరికాలో దీపావళికి హాలీడే!

by GSrikanth |   ( Updated:2023-05-27 11:30:26.0  )
అమెరికాలో దీపావళికి హాలీడే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలోను వెలుగుల పండుగ దీపావళికి సెలవు రానుంది. దీపావళి పండుగను ఫెడరల్ సెలవు దినంగా ప్రకటించాలని ‘దీపావళి డే యాక్ట్‌ ’ పేరుతో కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ప్రముఖ అమెరికన్ చట్టసభ సభ్యురాలు గ్రేస్డ్‌ మెంగ్‌ యూఎస్‌ శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని దేశవ్యాప్తంగా భారత సంతతి సభ్యులు, వివిధ సంఘాలు స్వాగతించాయి. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దీపావళి చాలా ముఖ్యమైన రోజు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను నిర్వహించడం విశేషం.

న్యూయార్క్‌లోని క్వీన్స్‌ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. దీపావళిని ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడుకలు చేసుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను చాటుతుంది’అని మెంగ్‌ తన బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు లభిస్తుంది. అదే జరిగితే, యునైటెడ్ స్టేట్స్‌లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ 12వ సమాఖ్య గుర్తింపు పొందిన సెలవుదినంగా గుర్తింపు పొందుతుంది.

Read More... లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఇలా చేయాల్సిందే?

Advertisement

Next Story