ప్రజాస్వామ్యంలో విబేధాలు అనివార్యం

by sudharani |
ప్రజాస్వామ్యంలో విబేధాలు అనివార్యం
X

చెన్నై: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య గొడవలు నెలకొన్నాయనే వార్తలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో విబేధాలు అనివార్యమని అయితే అది ఘర్షణలు కావని చెప్పారు. శనివారం తమిళనాడులో మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మా మధ్య విబేధాలు ఉన్నాయి. అంత మాత్రాన దానర్థం గొడవలున్నాయని కాదు. ఇది ప్రపంచానికి చెడు సందేశానికి ఇస్తుంది. దేశంలో వ్యవస్థల మధ్య ఎలాంటి సమస్య లేదని నేను స్పష్టం చేస్తున్నాను. పటిష్టమైన ప్రజాస్వామ్య చర్యలకు సంకేతాలు ఉన్నాయి’ అని అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండేందుకు కేంద్రం మద్దతు ఇస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో కోర్టుల్లో పూర్తి స్థాయిలో కాగిత రహితంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాల్లో ఉందన్నారు. సాంకేతిక సహాయంతో ఇది సాధ్యపడుతుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed