- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Youtuber: పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ సురేష్ కరంసీ రూ. 20 లక్షల పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ కోర్టు ధృవ్ రాఠీకి బుధవారం సమన్లు జారీ చేసింది. బీజేపీ నేత వేసిన దావాలో.. తనను అకారణంగా ఓ వీడియోలో హింసను సృష్టించే వ్యక్తిగా చెప్పాడని, తనపై లేనిపోని ఆరోపణలు చేశాడని అన్నారు. జూలై 7న ధృవ్ రాఠీ యూట్యూబ్ ఛానెల్‌లో 'మై రిప్లై టు గోడీ యూట్యూబర్స్ ఎల్విస్ యాదవ్ 'పేరుతో వీడియో అప్‌లోడ్ చేశాడని, అందులో తన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు కేసును నమోదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించిన కారణంగా, అందుకు పరిహారం రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సురేష్ కరంసీ దావాలో పేర్కొన్నారు. ఆగష్టు 6న కేసుకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్టు జిల్లా జడ్జి గుంజన్ గుప్తా తెలిపారు. ధృవ్ రాఠీ నిరాధారణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో హింసాత్మక ట్రోలర్లు అయిన అంకిత్ జైన్, తజిందర్ బగా, సురేష్ నఖువాలతో సమావేశమైనట్టు ధృవ్ రాఠీ తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ నేత తన పిటిషన్‌లో వివరించారు. అతను అప్‌లోడ్ చేసిన నకిలీ సమాచారం వీడియోను కోట్లాది మంది వీక్షించారు. తక్షణం సదరు వీడియో, పోస్ట్‌లను నిరోధించాలని పేర్కొన్నారు.