- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇళ్ల కూల్చివేత ఫ్యాషన్‌గా మారింది: బుల్డోజర్ చర్యపై మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: బుల్డోజర్ చర్యలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఇళ్ల కూల్చివేత ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిందని తెలిపింది. అధికారులు సరైన విధానాలు అవలంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొ రేషన్ (యూఎంసీ) నిబంధనలు పాటించకుండా తన ఇళ్లును కూల్చివేశారని, అందుకు పరిహారం ఇవ్వాలని రాధా లాంగ్రీ అనే మహిళ మధ్యప్రదేశ్ హై కోర్టును ఆశ్రయించారు. ఉజ్జయినిలోని సందపాణి నగర్‌లో తనకు చెందిన ఒక ఇంటిని, తన భర్తకు చెందిన మరో ఇంటిని ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేశారని కోర్టుకు తెలియజేశారు. తమ ఇళ్లు రూల్స్ ప్రకారమే కట్టామని, అధికారులు డాక్యుమెంట్లు చూపించేందుకు కూడా సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇల్లు హౌసింగ్ బోర్డులో రిజిస్టర్ అయిందని, బ్యాంకు రుణం సైతం తీసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఇళ్లు కూల్చివేత చట్టవిరుద్ధమని జస్టిస్ వివేక్ రుషియా వెల్లడించారు. పిటిషనర్‌కు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, అంతేగాక కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూల్స్ పాటించకుండా కూల్చడం ఏంటని ప్రశ్నించింది. బుల్డోజర్ చర్యలు ఫ్యాషన్‌గా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బుల్డోజర్ చర్యలు ఉత్తరప్రదేశ్‌లో మొదలైన విషయం తెలిసిందే.