- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో రోజురోజుకు తగ్గుతున్న నీటి సరఫరా.. సంక్షోభం మరింత తీవ్రం అవుతుందన్న మంత్రి అతిషి
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నీటి సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రతరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్‌లో ఢిల్లీలోని చాలా ఏరియాల్లో నీటి వనరులు తగ్గిపోయాయి. బోర్లలో నీరు మొత్తం కూడా అడుగంటి పోయింది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం హర్యానా ఢిల్లీకి తక్కువ నీటిని విడుదల చేస్తుందని ఆప్ మంత్రి కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున దేశ రాజధానిలో నీటి సంక్షోభం మరింత తీవ్రతరం అయిందని అన్నారు.
సాధారణ పరిస్థితుల్లో, ఢిల్లీలో రోజు 1005 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది, కానీ గత వారం నుండి ఇది నిరంతరం తగ్గుతోంది, జూన్ 6న నీటి సరఫరా రోజుకు 1,002 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) ఉండగా, మరుసటి రోజు 993 ఎంజీడీలకు, జూన్ 8 నాటికి 990, జూన్ 9న 978, మరుసటి రోజు జూన్ 10న 958 ఎంజీడీలు, జూన్ 11, జూన్ 12, జూన్ 13 తేదీల్లో వరుసగా 919, 951, 939 ఎంజీడీలుగా నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవకపోవడం, ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో నీటి కష్టాలు రాను రాను మరింత ఎక్కువ అవుతున్నాయి.