Delhi: నేడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త, ఆరుగురు మంత్రుల ప్రమాణం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

by Shiva |
Delhi: నేడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త, ఆరుగురు మంత్రుల ప్రమాణం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Rekha Gupta) ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పలువురు సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ రేఖా గుప్తా వైపే బీజేపీ పెద్దలు మొగ్గు చూపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాలీమార్‌ బాగ్‌ (Shalimar Bhag) నుంచి పోటీ చేసిన ఆమె ఆప్‌ అభ్యర్థి వందన కుమారి (Vandana Kumari)పై 29,595 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్‌ ప్రసాద్ (Ravi Shankar Prasad), ఓపీ ధన్‌ఖడ్‌ (OP Dhankhad)ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తా (Rekha Gupta)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు పర్వేష్‌ వర్మ (Parvesh Varma), విజేందర్‌ గుప్తా (Vijender Gupta), సతీశ్‌ ఉపాధ్యాయ్‌ (Satish Upadhyay) ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనా (VK Saxena)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ఆమోదంతో రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలుకుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్‌లో పర్వేష్ సాహిబ్ సింగ్, అశిష్ సూద్, మన్‌జిందర్ సింగ్ సిర్సా, రవిందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ పేర్లు ఉన్నాయి. వీరంతా సీఎం రేఖా గుప్తతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

రామ్‌లీలా మైదానంలో ఇవాళ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh), అమిత్‌ షా (Amit Shah), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pavan Kalyan)తో పాటు ఎన్డీయే పక్ష నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా సుమారు 25 వేల మందితో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.



Next Story

Most Viewed