- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్: మనీష్ సిసోడియాకు మళ్లీ ఎదురు దెబ్బ
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. తన భార్య ఆరోగ్యం బాగోలేదని అందువల్ల తనకు 6 వారాల బెయిల్ మంజూరు చేయాలని ఆయన తొలుత రౌస్ అవెన్యూలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో సిసోడియా కీలకమైన నిందితుడని ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పెషల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
Advertisement
Next Story