Delhi coaching centre deaths: ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

by Shamantha N |
Delhi coaching centre deaths: ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్ ప్రమాద ఘటనపై దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. కోచింగ్ సెంటర్లను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుందని ఆప్ ప్రకటించింది. కోచింగ్ సెంటర్ల కోసం నిబంధనలను రూపొందించేందుకు అధికారులు, విద్యార్థులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ మంత్రి అతిషీ తెలిపారు. వరదల కారణంగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 30 కోచింగ్ సెంటర్ల బేస్ మెంట్లు సీజ్ చేశామని తెలిపారు. 200 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశామన్నారు.

ముగ్గురు అభ్యర్థులు మృతి

ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ లోని ఐఏఎస్ సర్కిల్ లో వరదలు రావడంతో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించారు. ప్రముఖ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో చిక్కుకున్న ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మరణించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముగ్గురు విద్యార్థులను బలిగొన్న కోచింగ్ సెంటర్‌పై, అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed