Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు ‘సుప్రీం’ తీర్పు

by Hajipasha |
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు ‘సుప్రీం’ తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబరు 13న) తీర్పును వెలువరించనుంది. చివరిసారిగా ఈనెల 5న న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు విన్నది. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. బెయిల్ విషయంలో కేజ్రీవాల్ వాదనను తోసిపుచ్చారు.

కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘‘కేజ్రీవాల్ దేశం విడిచి వెళ్లే ఛాన్సే లేదు. ఆయన కరుడుగట్టిన నేరగాడు కాదు. బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ ఢిల్లీలోనే ఉంటారు’’ అని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్‌పై తీర్పును సెప్టెంబరు 13వ తేదీకి రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చినందున..ఇక కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడాన్ని సమర్ధిస్తూ ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయనకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed