కేజ్రీవాల్ కు చుక్కెదురు.. జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

by Dishanational6 |
కేజ్రీవాల్ కు చుక్కెదురు.. జ్యుడీషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ జ్యుడీషియల్ పొడిగించింది ఢిల్లీ కోర్టు. గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియనుండగా.. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు పురోగతిలో ఉందని.. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో కేజ్రీవాల్ కస్టడీని మే 20వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది ప్రత్యేక కోర్టు.

మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ అభ్యర్థనలపై ఇవాళ విచారణ జరిగింది. ఈడీ కూడా త‌న వాద‌న‌ల‌ను వినిపించింది. ఒక‌వేళ బెయిల్ మంజూరు చేస్తే, అప్పుడు అధికారిక విధులు నిర్వర్తించవద్దని కోర్టు ఆదేశించింది. ఫైల్స్ మీద సంతకాలు చేయవద్దని సూచించింది.

Next Story