- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపు సీబీఐ విచారణకు హాజరవుతా: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రేపు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చిందని విచారణకు తాను ఖచ్చితంగా వెళ్తానన్నారు. కేజ్రీవాల్ అవినీతి పరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీపరుడు ఇంకెవరూ ఉండరని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతానికి భిన్నంగా అసాధారణ స్థాయిలో ఎజెన్సీలను ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం అనేదే లేదని, రూ.100 కోట్లు ముడుపులు చేతులు మారాయని ఈడీ, సీబీఐ ఆరోపిస్తోందని ఇప్పటి వరకు ఒక్క పైసా దొరకలేదన్నారు. కోర్టు ముందుకు ఈడీ, సీబీఐలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని, ఈడీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారని ఆరోపించారు.
ఇప్పటి వరకు లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వాళ్లను దర్యాప్తు సంస్థలు వేధించాయని రేపు సీబీఐ ముందుకు వెళ్లి తాను మోడీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెబితే నమ్ముతారా? ప్రధానిని విచారిస్తారా అని ప్రశ్నించారు. కొత్త లిక్కర్ పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందని కావాలనే ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసి పార్టీలోని ఒక్కొక్కరిని ఇరికిస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయాలని బీజేపీ ఆదేశిస్తే సీబీఐ ఆ సూచనలను కచ్చితంగా పాటిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఈ కేసులో నెలల తరబడి విచారణ జరిపి, అనేక మందిని అరెస్టులు చేసినప్పటికీ ఈ స్కాం పేరుతో సేకరించినట్లు చెపుతున్న అక్రమ సంపాదనలో ఒక్క పైసా కూడా ఎజెన్సీలు కనుగోలేక పోయాయని విమర్శించారు. గోవా ఎన్నికల్లో అక్రమ సంపాదన డబ్బులను ఖర్చు చేశామని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందంతా అవాస్తవం అన్నారు. మా చెల్లింపులన్ని చెక్కుల రూపంలోనే జరిగాయని అన్నారు.