Delhi: ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎస్ తీవ్ర ఆరోపణలు

by Shamantha N |
Delhi: ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎస్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తన శాఖను పట్టించుకోలేదన్నారు. వరద నియంత్రణ శాఖ సౌరభ్ అధీనంలోనే ఉంది. కాగా.. ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఢిల్లీ సీఎస్ అన్నారు. కోచింగ్ సెంటర్ డ్రెయిన్ ని ఆక్రమించి ర్యాంపు నిర్మించిందన్నారు. గతేడాది వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కాగా.. వరదల నివారణకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 18 ఏళ్లుగా డ్రైనేజీ నిర్వహణను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని అప్పుడు గుర్తించామన్నారు.

డ్రైనేజీ మాస్టర్ ప్లాన్

డ్రైనేజీల్లో వ్యర్థాల తొలగింపు, డంపింగ్ యార్డుల సమస్యల పరిష్కారానికి నీటి పారుదల చట్టం ఆవశ్యకతను నొక్కి చెప్పామని సీఎస్ అన్నారు. ఆ భేటీలోనే ఢిల్లీలో డ్రైనేజీకి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పరిశోధనలను 2023 ఆగస్టులో మంత్రికి సమర్పించామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అవన్నీ అతని దగ్గరే ఉన్నాయని చెప్పారు. ఐదు నెలల తర్వాత ప్రజెంటేషన్ అడిగారన్నారు. చట్టం తీసుకురావడంపై నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. మాస్టర్ డ్రైనేజీ ప్లాన్‌పై ఐఐటీ ఢిల్లీ ఇచ్చిన నివేదికను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పారు. మూడు ప్రత్యేక నీటి పారుదల ప్రణాళికలు సిద్ధం చేయాలని అప్పుడు నిర్ణయించారు.. కానీ ఇప్పటివరకు ఎటువంటి ముఖ్యమైన పని జరగలేదన్నరు. నీటిపారుదల చట్టం ముసాయిదా ఇప్పటికీ మంత్రి దగ్గరే పెండింగ్ లో ఉందని చెప్పారు. ఢిల్లీలోని తుఫాను నీటి పారుదల వ్యవస్థను సరైన ప్రణాళిక లేదని.. భారీ వర్షాలు కురిసినప్పడు అనేక ప్రాంతాల్లో వరదలకు దారితీస్తుందని పేర్కొన్నారు

Advertisement

Next Story

Most Viewed