Deepfake : ‘డీప్ ఫేక్‌‌’.. పెద్ద సమస్య : ప్రధాని మోడీ

by Vinod kumar |   ( Updated:2023-11-22 13:31:01.0  )
Deepfake : ‘డీప్ ఫేక్‌‌’.. పెద్ద సమస్య : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ : భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో మెరుపు వేగంతో వృద్ధి చెందుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై పకడ్బందీ పర్యవేక్షణ అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు జీ20 దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన జీ20 వర్చువల్ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏఐని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ప్రజలకు ఏఐ చేరువ కావాలి. అయితే అది తప్పకుండా సురక్షితంగా ఉండాలి. డీప్ ఫేక్ అనేది చాలా ఆందోళన కలిగించే అంశం. దానిపట్ల అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈనేపథ్యంలో భారత్ చొరవతో జీ-20లోకి ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం లభించిన అంశంతో పాటు కూటమి సాధించిన పలు విజయాలను ప్రధాని మోడీ గుర్తు చేశారు. “సవాళ్లతో నిండిన నేటి ప్రపంచంలో పరస్పర విశ్వాసమే మనల్ని ఏకం చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదం అనేది జీ20 దేశాలకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed