- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: కోరమండల్ ఎక్స్ ప్రెస్‌కు ఘోర ప్రమాదం... 100 మందికి పైగా తీవ్ర గాయాలు
దిశ, వెబ్ డెస్క్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశాలో ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి 7 బోగీలు ఫల్టీలు కొట్టాయి. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 200 మందికి పైగా బోగీల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాలాసోర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్వేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
క్షతగాత్రులను ఐదు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ రైలు ఉన్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లడంపై రైల్వే అధికారులు విచారిస్తున్నారు.
Also Read: Coromandel express accident : కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?