- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అలా అన్నందుకు క్షమించండి..' సిక్కులకు కిరణ్‌బేడీ క్షమాపణ! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సిక్కుల మనోభావాలను దెబ్బతీసినట్లు మాట్లాడరిని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సోమవారం ఆమె రాసిన 'ఫియర్‌లెస్ గవర్నెన్స్' అనే పుస్తకాన్ని ఆవిష్కరణలో సభ సందర్భంగా ఈ మాజీ ఐపీఎస్ సిక్కులపై '12 గంటల జోక్'ను పేల్చిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ఈ వివాదం చెలరేగింది. బేడీ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ ఇన్‌ఛార్జ్ జర్నైల్ సింగ్ ఖండించారు. "మొఘలులు భారతదేశాన్ని దోచుకుంటున్నప్పుడు, మహిళలను అపహరిస్తున్న సమయంలో, భారతీయులంతా భయపడుతూ బిక్కు బిక్కుమని బతుకుతుంటే, సిక్కు సోదరులు ముందుకొచ్చి మొఘలులతో పోరాడారు. భారత సోదరీమణులను, కుమార్తెలను రక్షించుకునేవారు. అయితే, ఆ దాడి సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకే చేసేవారు. కనుక, ఇది 12 గంటల చరిత్ర అయ్యింది. అయితే, సిక్కులకు గౌరవం ఇవ్వడానికి బదులు వారిని ఎగతాళి చేయడం చీప్ మెంటాలిటీ ఉన్న బీజేపీ నేతలకు సిగ్గుచేటు" అని సింగ్ హిందీలో ట్వీట్ చేశారు.
जब मुग़ल भारत को लूट कर, बहन,बेटियों को अगवा कर ले जा रहे होते थे,तब सिख ही उनसे डटकर लड़ते व बहन बेटियों की रक्षा करते थे,
— Jarnail Singh (@JarnailSinghAAP) June 14, 2022
12 बजे था मुगलों पर हमला करने का समय
ये है 12 बजे का इतिहास
शर्म आनी चाहिए भाजपा के टुच्ची सोच वाले नेताओं को जो उस एहसान का बदले सिखों का मजाक उड़ाते हैं pic.twitter.com/4RiJkoR2sU
అయితే, ఈ చారిత్రక సందర్భం '12 గంటల జోక్'గా చిత్రీకరించబడింది. దీన్నే బేడీ సభలో ప్రస్తావించారు. సిక్కుల నుండి వ్యతిరేకత చెలరేగడంతో దీనిపై స్పందించిన కిరణ్ బేడీ, 'ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని' ట్వీట్ చేశారు. 'నా ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. నేను బాబా నానక్ దేవ్ జీకి భక్తురాలిని. నేను ప్రేక్షకులతో చెప్పినది తప్పుగా అర్థం చేసుకోవద్దు. దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఎవరికీ బాధ కలిగచేయాలనే మనస్తత్వం కాదు నాది. నేను సేవను నమ్ముతాను. దయను ప్రేమిస్తున్నాను" అని బేడీ ట్వీట్‌లో స్పందించారు. అయితే, బేడీ మాటలను ట్విట్టర్‌లో పలువురు తీవ్రంగా ఖండించగా, తనను ట్రోల్ చేసే వారిపై చర్యలు తీసుకుంటానని బేడీ హెచ్చరించారు.
We did Path and Seva same morning. I am a devotee. I seek Baba's blessings all the way. I started the day with Path in the house. Please do not doubt my intention. I have the highest regards and admiration for my community and my Faith. pic.twitter.com/ClW0DuuyoG
— Kiran Bedi (@thekiranbedi) June 14, 2022