- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు వేళాయె.. ఏయే హామీలు ఉన్నాయంటే..
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేయనున్నారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేయనుంది. శనివారం రోజు రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ‘పాంచ్ న్యాయ్ ’ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తోంది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను ప్రకటించింది. ‘న్యాయ్ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలివీ..
* 30 లక్షల ఉద్యోగాల కల్పన
* రూ.5000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
* నిరుద్యోగ భృతి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ
* విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
* అగ్నివీర్ స్కీం రద్దు.. ఆర్మీలో పాత రిక్రూట్‌మెంట్ స్కీమ్ మళ్లీ అమల్లోకి
* గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ
* రూ.450కి వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ
* బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
* రైతులకు కనీస మద్దతు ధరపై హామీ
* వ్యవసాయ పరికరాల ధరల నుంచి జీఎస్టీ మినహాయింపు
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
* కుల గణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన
* రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
* న్యాయ్ యోజన ద్వారా పేద కార్మిక కుటుంబాలకు సంవత్సరానికి రూ.72 వేల సాయం
* రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీల కల్పన
* రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
* చిన్నతరహా పరిశ్రమల రుణాలను కొంతమేరకు మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ
* దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ