- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశా రైలు ప్రమాదంపై ఖర్గే కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బాలాసోర్ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు బాలాసోర్ చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో తలనమునకలై ఉన్నారని, ఇంకా చాలా మంది అక్కడికి చేరుకుంటారని ఖర్గే తెలిపారు.
ఈ ప్రమాదంపై పీఎం మోడీని, రైల్వే మంత్రిని ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉన్పప్పటికీ తమ తక్షణ కర్తవ్యం మాత్రం ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావడమే అని ఖర్గే తెలిపారు. కాగా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటివరకు దాదాపు 300కు పైగా మరణించగా మరో 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
At this moment of grave national tragedy on account of the terrible train disaster in Odisha, I have instructed the entire Congress party organisation to extend all possible and needed help.
— Mallikarjun Kharge (@kharge) June 3, 2023
1/3 pic.twitter.com/TGK8NavywB