రంగంలోకి సోనియా గాంధీ.. స్పెషల్ పార్లమెంట్ సెషన్స్‌పై వ్యూహ రచన

by Vinod kumar |   ( Updated:2023-09-04 16:37:12.0  )
రంగంలోకి సోనియా గాంధీ.. స్పెషల్ పార్లమెంట్ సెషన్స్‌పై వ్యూహ రచన
X

న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తన నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ తో సోనియా భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సెషన్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈసందర్భంగా హస్తం పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ లోని సభ్యులకు సోనియాగాంధీ దిశానిర్దేశం చేయనున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

ఈసారి పార్లమెంట్ సెషన్‌లో ప్రశ్నోత్తరాలకూ ఛాన్స్ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినందున.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై సోనియా అండ్ టీమ్ చర్చించనున్నారని తెలిసింది. ఈ మీటింగ్ ముగిసిన రెండు గంటల తర్వాత (మంగళవారం రాత్రి 7 గంటలకు) ఇండియా కూటమిలోని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు.

ఇటీవల ముంబై వేదికగా జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లో భాగస్వామ్య పార్టీల నుంచి ఒక్కో ఎంపీని ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. ఖర్గే నిర్వహించనున్న మీటింగ్‌లోనూ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌పై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కషన్ జరగనుందని తెలిసింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానంపై కేంద్రం నియమించిన హైలెవల్ కమిటీపై, జమిలి ఎన్నికల దిశగా మోడీ సర్కారు కసరత్తు గురించి ఈ రెండు మీటింగ్‌లలోనూ చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే అవకాశమున్న 10కిపైగా ముఖ్యమైన బిల్లులపైనా డిస్కషన్ జరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story