బెయిల్‌పై బయటకొచ్చిన డేరా బాబా.. ఈసీకి కాంగ్రెస్ ఘాటు లేఖ

by karthikeya |
బెయిల్‌పై బయటకొచ్చిన డేరా బాబా.. ఈసీకి కాంగ్రెస్ ఘాటు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న డేరా బాబా అలియాజ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ బెయిల్‌పై బయటకొచ్చాడు. హర్యానా ఎన్నికల వేళ గుర్మీత్ సింగ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఈసీ సోమవారం నాడు ఆమోదించింది. దీంతో డేరా బాబా జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే గుర్మీత్ సింగ్ విడుదలపై హర్యానా కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. సరిగ్గా ఎన్నికల టైంలో గుర్మీత్‌ సింగ్‌ను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అధిగమించడమేనంటూ ఏకంగా ఈసీకి స్పెషల్‌గా లెటర్ రాసింది.

అలాగే 2019 డేరా బాబా చేతిలో అరెస్ట్ చేయబడ్డాడని చెబుతున్న జర్నలిస్ట్ కుమారుడు కూడా డేరాబాబా బెయిల్‌పై రిలీజ్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను రిలీజ్ చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించడమే. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపుతారు. దీనివల్ల ఓటింగ్‌ ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది’’ అంటూ విమర్శలు చేశారు.

Next Story

Most Viewed