- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజరు!
దిశ, డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీకి రాజ్ నాథ్ సింగ్ ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌తో పాటు బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు, కేశవరావు హాజరయ్యారు. వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ పార్టీ నేతలు ఆల్ పార్టీ మీటింగ్‌లో హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసమావేశానికి గైర్హాజరు అయింది. శ్రీనగర్‌లో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు సభ కారణంగా మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి ఇద్దరూ ఈ మీటింగ్‌కు రాలేకపోయినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. అఖిలపక్ష సమావేశం అనేది పార్లమెంటు ప్రతి సెషన్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి చేసిన ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేకావడంతో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతోందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.