- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యధికసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిన రికార్డు కాంగ్రెస్‌దే: రాజ్‌నాథ్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అనేకసార్లు కూల్చివేసిన రికార్డు కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీజేపీ రాష్ట్ర మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. దేశంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటివరకు దేశంలో 356వ అధికరణం కింద 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా, అందులో 90 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. అందులోనూ ఇందిరా గాంధీ అత్యధికంగా 50 ప్రభుత్వాలను కూల్చిన రికార్డు ఉంది. ప్రధాని మోడీ ఒక్క ప్రభుత్వాన్నైనా పడగొట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన రక్షణ మంత్రి 10 ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతి ఒలంపిక్స్ జరగ్గా, కాంగ్రెస్ దాని ఆర్గనైజర్ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కాంగ్రెస్, సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేసిందని పేర్కొన్నారు.