Haryana Congress: 13 సీట్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

by Mahesh Kanagandla |
Haryana Congress: 13 సీట్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కిన ఈ ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు పంపిన ఫిర్యాదులతో తాజాగా ఎన్నికల సంఘానికి మెమోరాండం అందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ముఖ్యంగా హర్యానాలోని 13 సీట్లల్లో ఈ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టీమ్ ఆరోపణలు చేసింది.

కాంగ్రెస్ పానిపట్ అభ్యర్థి వరిందర్ కుమార్ సహా పలువురి ఈవీఎం ఫ్రాడ్ ఆరోపణల ఫిర్యాదుతోపాటు ఖర్గే టీం అప్‌డేటెడ్ మెమోరాండంను ఈసీకి అందించింది. వరిందర్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. ఓట్లు లెక్కించేటప్పుడు చాలా ఈవీఎం కంట్రోల్ యూనిట్ల బ్యాటరీ లెవెల్స్ 99 శాతం ఉన్నదని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. తమ ఏజెంట్లు 17సీ ఫామ్స్‌ను కౌంటింగ్ హాల్‌కు తీసుకెళ్లడానికి అనుమతించలేదని, తద్వార ఆ పోలింగ్ స్టేషన్‌లో పడిన ఓట్ల లెక్కింపు గురించి వారికి అవగాహన లేకుండా చేశారని ఆరోపించాడు. డేటాను మ్యాచ్ చేసి చూసే అవకాశాన్ని తమ ఏజెంట్లకు ఇవ్వలేదని, ఇవే ట్యాంపరింగ్ ఆరోపణలకు తావిస్తున్నదని తెలిపాడు. కాంగ్రెస్ పేర్కొన్న 13 సీట్లల్లో 12 సీట్లు బీజేపీ గెలుచుకోగా ఒకటి ఐఎన్ఎల్‌డీ గెలుచుకుంది. ఇందులో బద్కల్, ఫరీదాబాద్ ఎన్ఐటీ, నల్వా, రాణియా,పల్వాల్, బల్లబ్‌బార్గ్, బర్వాలా, ఘరౌండాలు ఉన్నాయి.

Advertisement

Next Story