నోటాకు ఓటెయాలన్న కాంగ్రెస్.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 9 |
నోటాకు ఓటెయాలన్న కాంగ్రెస్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది పార్టీ నాయకుల జోరు మరింతగా పెరుగుతోంది. కొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ పార్టీ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుని నోటాకు ఓటెయ్యాలని ప్రచారానికి దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్షయ్ కాంతి అనే కాంగ్రెస్ అభ్యర్థి చివరి క్షణాల్లో నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరాడు. దీంతో కాంగ్రెస్ పోటీలో లేకుండా లేయింది. కాగా అక్షయ్ కాంతి నోటాకు ఓటెసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తుంది.

Next Story

Most Viewed