బిగ్ బ్రేకింగ్: సెంట్రల్ ఎలక్షన్ కమిటి ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుండి ఆ ఒక్క ఎంపీకే ఛాన్స్

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: సెంట్రల్ ఎలక్షన్ కమిటి ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుండి ఆ ఒక్క ఎంపీకే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దూకుడు పెంచింది. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమితో ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్.. తాజాగా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో 16 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని ఇవాళ పార్టీ హై కమాండ్ ప్రకటించింది.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అంబికాసోని, కాంగ్రెస్ పార్లమెంటరీ నేత అధిర్ రంజన్ చౌదరి, తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, సింగ్ దేవ్, పూనియా, కేసీ వేణుగోపాల్, ఓంకార్, అమీయాజ్ఞిక్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మద్ జావేద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ నుండి కేవలం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే కాంగ్రెస్ సెంట్రల్ సెలక్షన్ కమిటీలో చోటు దక్కడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed