PrayagRaj Mahakumbhamela : కిక్కిరిసిన ప్రయాగ్ రాజ్ రోడ్లు... సీఎం సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
PrayagRaj Mahakumbhamela : కిక్కిరిసిన ప్రయాగ్ రాజ్ రోడ్లు... సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్(UP PrayagRaj) లో జరుగుతున్న మహా కుంభమేళా(Mahakumbhamela)లో రోజురోజుకీ భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(MP CM Mohan Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వాహనాలతో ప్రయాగ్ రాజ్ తోపాటు రివంచల్ జిల్లాపై తీవ్ర వాహనాల రద్దీ(Heavy Traffic Jam) పెరిగిందని అన్నారు. రివంచల్ జిల్లా ప్రజలు రెండు రోజుల వరకు ఆ మార్గంలో వెళ్ళడం మానుకోవాలని, తప్పనిసరి అవసరం అయితే గూగుల్ మ్యాప్(Google Map) చూసుకొని, ట్రాఫిక్ ఒత్తిడి లేని మార్గాలను ఎన్నుకోవాలని తెలిపారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రయాగ రాజ్ కు రావడం మంచి విషయమే కాని, వారి సురక్షిత ప్రయాణంపై ఆందోళన కలుగుతోందని తెలిపారు. గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడం ఎవరికైనా ఓపికకు పరీక్ష పెట్టె విషయమే అని అన్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కున్న యాత్రికులకు ఎప్పటికప్పుడు నీరు ఆహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

కాగా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్, సివనీ, కాట్ని, సత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 300 కిమీల మేర ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయిందని పోలీసులు తెలిపారు. కేవలం 50 కిమీల దూరం ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతోంది అంటే వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ ఏ మేర ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. కాగా జనవరి 13న మొదలైన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఇప్పటి వరకు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్(UP) ప్రభుత్వం పేర్కొన్నది.

Next Story

Most Viewed