- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కంపెనీలు
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు కోవిడ్ నియంత్రణలను తిరిగి తీసుకువచ్చే సన్నాహాలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలతో కంపనీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబై మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కేసుల ప్రభావంతో పబ్లిక్ ప్లేసులలో ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కంపెనీ ప్రతినిధులు కార్యాలయానికి వచ్చే సిబ్బందికి రక్షణ ప్రోటోకాల్స్ పాటించేలా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా, డెలాయిట్, మెర్సెడెస్ బెంజ్, ఫోర్బ్స్ మార్షల్, ఫోర్బ్స్ మార్షల్, థర్మాక్స్, మారికో, టెక్ మహీంద్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మరియు జిందాల్ స్టెయిన్‌లెస్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కేసుల సంఖ్య పెరిగితే అనేక కార్పొరేట్ సంస్థలు మాస్ టెస్టింగ్‌ను పెంచాలని కూడా ప్లాన్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు బూస్టర్ షాట్‌లు తీసుకునేలా సిబ్బందిని కూడా ప్రోత్సహిస్తున్నాయి. పలు కంపెనీలు సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. షిఫ్టుల వారీగా విధులతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే వారానికి ఒకసారి సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరోసారి 4వేలకు పైగా కేసులు నమోదు..
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. క్రితం రోజు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, తాజాగా 4,270 కొత్త కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 15 మంది వైరస్ బారిన పడి మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 1,636 పెరిగి దేశవ్యాప్తంగా 24,052కు చేరింది. మరోవైపు మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం రికార్డు స్థాయిలో 1,494 కొత్త కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో ఒక మరణం చోటు చేసుకుంది. తాజా కేసులతో రాష్ట్రంలో 6,767 క్రియాశీలక కేసులు ఉన్నాయి.