CM Yogi : కుంభమేళాపై సీఎం యోగి వార్నింగ్ !

by Y. Venkata Narasimha Reddy |
CM Yogi : కుంభమేళాపై సీఎం యోగి వార్నింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్ : కుంభమేళా(Maha Kumbh Mela), సనాతన ధర్మం..గంగామాత, భారత్ పై నిరాధారమైన ఆరోపణలు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే అది కుంభమేళాలో ఇప్పటికే పుణ్యస్నానాలు చేసిన 56.25కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్లేనని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాధ్(CM Yogi Adityanath) హెచ్చరించారు(Warning). అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి కుంభమేళా నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో 56.25కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారన్నారు.

ఫిబ్రవరి 26న మరో షాహిస్నానం ఇంకా మిగిలి ఉందని..ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ కు ఇంకా భక్తులు పొటెత్తుతారని..ఫిబ్రవరి 26 వరకు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని.. దాదాపుగా.. 60 కోట్ల వరకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య ఉండవచ్చని యోగి వెల్లడించారు.144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభంలో ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలన్న లక్ష్యంతో భక్తులు తరలివస్తున్నారని వివరించారు. మహాకుంభమేళాను ఏ పార్టీనో, సంఘమో నిర్వహించలేదని..ప్రభుత్వం ఓ సేవకుడిగా భాధ్యతలతో నిర్వర్తించిందన్నారు.

కుంభమేళాలో తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి యోగి సంతాపం ప్రకటించారు. అంతకుముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం యోగి సమాధానమిస్తూ మహాకుంభమేళాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7,500కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి 3లక్షల కోట్ల ఆదాయం రానుందని తెలిపారు. ఈ ఏడాదిలో అయోధ్య ఆలయానికి రూ.700కోట్ల మేరకు ఆదాయం సమకూరిందని తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed