- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Omar Abdullah : కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీరు(Jammu Kashmir)కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తప్పకుండా అవసరమని సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) అన్నారు. భూమి, సహజ వనరులకు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు జమ్మూకశ్మీరుకు లభించాలంటే.. రాష్ట్ర హోదా లభించి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా కశ్మీర్ ఎదగాలన్నా, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా రాష్ట్ర హోదా అత్యంత కీలకమన్నారు. ఈమేరకు అసెంబ్లీలో ఒమర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
‘‘జమ్మూకశ్మీర్ ప్రజల శ్రమతో ఏర్పడిన ప్రభుత్వ ఖజనాను ఇతరులకు అమ్మకానికి పెడతామంటే ఊరుకోం. దాన్నికంటికి రెప్పలా కాపాడుకుంటాం. కశ్మీరీలు పేదరికంలో మగ్గకూడదు. ఇతర రాష్ట్రాల ప్రజలలా వాళ్లు కూడా ఎదగాలంటే రాష్ట్ర హోదా కావాలి’’ అని ఆయన చెప్పారు. ‘‘జమ్మూకశ్మీర్ ఉనికి కోసం.. ఇక్కడి ప్రజల ఔన్నత్యం, గౌరవం కోసం రాష్ట్ర హోదా కావాలి. అది లేకుండా.. కశ్మీరీల హక్కులు, ఉనికి ప్రమాదంలో పడతాయి’’ అని సీఎం ఒమర్ చెప్పారు.