తొక్కిసలాట పై సీఎం స్టాలిన్ ప్రకటన విడుదల

by Mahesh |
తొక్కిసలాట పై సీఎం స్టాలిన్ ప్రకటన విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం చెన్నై(Chennai) మేరీనా బీచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో(Air Show) తొక్కిసలాట జరిగి ఐదుగురు మతి చెందారు. ఆదివారం కావడంతో IAF 92 వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు 15 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు. షో ముగిసిన అనంతరం తిరిగి వెళ్తుండగా లోకల్ రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో వందల సంఖ్యలో ప్రజలకు గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎం కె స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. "అధిక వేడి, ఇతర వైద్య కారణాల వల్ల 5 మరణాలు సంభవించాయని తెలిసి నేను బాధపడ్డాను. బాధిత కుటుంబాలు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మరణించిన వారి కుటుంభాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాము" అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed