- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో తన అరెస్ట్ అక్రమంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసి.. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. విచారణ కోసం బుధవారం ఆగాలని సూచించింది.
బుధవారం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో తన అరెస్ట్, కస్టడీని కొట్టేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్ నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More..
పీడీ యాక్ట్ వ్యవహారం : తెలంగాణ సర్కారు, పోలీసు శాఖకు ‘సుప్రీం’ మొట్టికాయలు