తమిళనాడు సీఎం స్టాలిన్ కు కేసీఆర్ బర్త్ డే విషెస్

by Javid Pasha |
తమిళనాడు సీఎం స్టాలిన్ కు కేసీఆర్ బర్త్ డే విషెస్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు రాష్ట్ర సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజా సేవలో తరించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసిఆర్ కు ఎంకే స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. కొద్ది రోజుల క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై వారిరువురు చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed